బోధగయను సందర్శించిన వియత్నాం ప్రధానమంత్రి

 
ఈ మధ్య భారత పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధానమంత్రి బీహారులోని బోధగయకు వెళ్ళి గౌతమబుద్ధుని ప్రార్థించారు.  ఏ వృక్షం క్రింద గౌతమబుద్ధునికి జ్ఞానం లభించిందో ఆ వృక్షాన్ని సందర్శించి ప్రార్థించారు. ఆ తదుపరి నలందా విశ్వవిద్యాలయం పునర్నిర్మాణ కార్యాన్ని స్వాగతిస్తూ "వెయ్యి సంవత్సరాలకు పూర్వం బౌద్ధంతో సంబంధం ఉన్న విశ్వద్యాలయం నలందా విశ్వవిద్యాలయమని, దాని పునర్నిర్మాణం గర్వించదగినది" అని ప్రస్తుతించారు. బౌద్ధం 2,500 సంవత్సరాలుగా ప్రజలలో ఉన్నదని కొనియాడారు. నలందా విశ్వవిద్యాలయ పునర్నిర్మాణానికి సహకరిస్తామని వాగ్దానం చేశారు.