రాజ్యాంగం కూడా మనలను కాపాడలేదు

డాక్టర్ మోహన్ భాగవత్
 
"భారతదేశం హిందువులది. ఇది హిందూదేశం, హిందూరాజ్యం. ఇది అక్షరసత్యం. అదే మాటకు కట్టుబడి ఉందాము. హిందువులంతా ఒక్కతాటిపైకి రావలసిన సమయం ఆసన్నమైంది. మనమే దేశాన్ని మహోన్నత స్థానంలో నిలపాలి. అందుకు ఇదే మంచి తరుణం. మన దేశం శక్తివంతమైనప్పుడే ప్రపంచానికి మేలు జరుగుతుంది. హిందువులకు, ముస్లిములకు మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు మధ్యేమార్గం ఉద్భవిస్తుంది. ఆ మార్గమే హిందుత్వం. మనలో మనమే తన్నుకున్నంతసేపు భారత రాజ్యాంగము కూడా మనలను కాపాడలేదు" అన్నారు ఆర్.ఎస్.ఎస్. అధినాయకుడు డాక్టర్ మోహన్ భాగవత్. ఉత్తరప్రదేశ్ లో మారఠ్ నగరంలో జరిగిన ఒక సభలో వారు ఈ ప్రస్తావన చేశారు.
 
- ధర్మపాలుడు