గంగమ్మ తల్లిని రక్షిస్తారట


మన గంగానది పావనగంగ. అన్ని పాపాలనూ కడిగి వేయగల నదీమతల్లి. భూ ప్రపంచంలోని అన్ని నదులలోనూ అతి పవిత్రం, హిందువులకు ప్రాణసమానం. అటువంటి గంగను కూడా అపవిత్రం చేస్తున్నారు మన సెక్యులర్ పాలకులు. ఇది ఇలా ఉండగా మొన్ననే ఒక వార్త వచ్చింది. యు.పి.ఏ. ప్రభుత్వం గంగానదిని శుద్ధీకరించడానికి ఒక బృహత్ పథకం చేపట్ట బోతున్నదట. పరిసర వాతావరణం అరణ్య శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి జయంతి తన మంత్రిత్వ శాఖ అధికారులకు "గంగా నది శుద్ధీకరణ" ప్రణాళిక రచించమని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆమె క్రొత్త ధిల్లీలో ఒక ప్రకటన చేశారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! 

ఐతే ఈ చర్యకు వెనుక ఉన్న కారణం వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. గంగానది పవిత్రీకరణ కోసం కొందరు హిందూ సాధువులు చేస్తున్న ఆందోళన శృతి మించుతున్నదట, వచ్చే జనవరి (2013) లో ప్రయాగలో కుంభమేళా ఉన్న కారణంగా హిందూ ఆందోళన యు.పి.ఏ.కి ఒక తలనొప్పిగా తయారైందని అభిజ్నవర్గాల  సమాచారం. అందుకోసమే ఈ కంటి తుడుపు చర్య.

- ధర్మపాలుడు