ప్రపంచానికి యోగా నేర్పుదాం - ప్రధాని

 
జూన్ 21న ప్రపంచానికి యోగా నేర్పుదామని ప్రధాని నరేంద్రమోదీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. జూన్ 21ని 'అంతర్జాతీయ యోగ దినం'గా ఐక్యరాజ్యసమితి ప్రకటించినందున ఆ రోజు యోగాలో ప్రపంచరికార్డు నెలకొల్పుదామని ప్రధానమంత్రి నరేంద్రమోది పిలుపునిచ్చారు. ప్రపంచానికి సరైన యోగాను నేర్పించే బాధ్యత మనదేనని తెలిపారు. జనవరి 28న ఢిల్లీలో జరిగిన ఎన్.సి.సి. వార్షిక గణతంత్రదినోత్సవ శిబిరం ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. జూన్ 21న దేశవ్యాప్తంగా ఒకే సమయంలో యోగా చేసి రికార్డు సృష్టించాలని సూచించారు. అన్ని రికార్డులు బద్దలయ్యేలా అత్యంత ఎక్కువమంది ఆ రోజు యోగాలో పాల్గొనాలని అన్నారు. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావటం యోగసాధకులకు గర్వకారణమన్నారు. ప్రపంచానికి సరైన యోగాను అందించటం, యోగా జన్మస్థలమైన భారత్ బాధ్యతని, యోగా అనేది సరిహద్దులకు, వయస్సుకు, భాషకు పరిమితమైనది కాదని తెలిపారు.

ధ్యాన స్థితిలో పరమ శివుడు