పెద్ద రంగవల్లితో స్వామి వివేకానందకు నివాళి


పుణేలోని బి.ఎం.సి. కళాశాల ఆవరణలో 62 సంవత్సరాల వయసు గల జగదీశ్ చవాన్ అనే రంగవల్లి కళాకారుడు జనవరి 12న స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకొని తన ఎనభైమంది శిష్యబృందంతో 5,000 చదరపు అడుగుల అతిపెద్ద రంగవల్లిక (ముగ్గు)ను కన్యాకుమారిలోని వివేకానంద స్మారకాన్ని పోలి ఉండే విధంగా వివిధ రంగులతో తీర్చిదిద్దారు. ఈ అతి పెద్ద ముగ్గును స్వామి వివేకానంద స్మృతికి అంకితమిస్తూ 'నా జన్మ ధన్యమైంది' అని వ్యాఖ్యానించారు.


- పతికి