నిత్య గోపూజ

గోవా గవర్నర్ శ్రీమతి మృదులా సిన్హా
 
గోమంతక రాష్ట్రం (గోవా) గవర్నర్ శ్రీమతి మృదులా సిన్హా 'వాల్పాయ్'లో ఉన్న జైశ్రీరాం గోసంవర్ధన కేంద్రాన్ని (జె.ఎస్.జి.కె.) సందర్శించారు. ఈ కేంద్రంలో 250 ఆవులు ఉన్నాయి. ఒక వందమంది గోసేవకులు పాల్గొన్న కార్యక్రమంలో మృదులా సిన్హా కూడా పాల్గొని "గోపూజ" చేశారు. తనకు బాల్యం నుండి గోపూజ అలవాటు అని చెప్పిన గవర్నర్ ఒక ఆవునూ, దూడను దత్తత తీసుకున్నారు. ఈ గోవును రాజ్ భవన్ లోనే పెంచుతానని, ప్రతిదినం గోపూజ చేసిగాని ఏ పని మొదలుపెట్టనని ఆమె ప్రకటించారు. రాజ్ భవన్ లో ఒక గోశాల కూడా నిర్మిస్తున్నట్లు జె.ఎస్.జి.కె. అధ్యక్షులు మరియు న్యాయవాది అయిన హనుమత్ ప్రణాబ్ వెల్లడించారు.
 
- ధర్మపాలుడు