వైఫల్యానికి మరోపేరే జిహాద్

ప్రముఖుల మాట

ఎం.జె. అక్బర్

ఆధునికతకు సంబంధించిన వైఫల్యమేదైనా గాని ఊహాత్మకమైన గతానికి ఆహ్వానం పలికేదే. రాజరిక పితృస్వామ్యం నుండి నాజర్ తరహా జనరంజక విధానాల వరకు, బాతిస్టుల ఉదారవాదం వరకు అన్ని నమూనాలు సైనిక నియంతృత్వానికి దారితీసినవే. చివరకు తాత్కాలిక ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లువెత్తినా.. అదీ కుప్పకూలింది. మిగతావాటిలాగా అణచివేతకు గురైంది. కడకు నిలచినది మతవిశ్వాసానికి తిరిగిపోవడమనే భావనే. దీనికి అర్థం ఏమిటో ఏ ఒక్కరికి తెలియదనేది వేరుసంగతి. అది మదీనాపట్ల విశ్వాసాన్ని తగ్గించి, అరేబియాలోనూ, భారత్ లోనూ ఇస్లామిక్ మిలిటెన్సీ పుట్టి పెరిగేలా చేసింది. ఈ ధోరణి ముస్లింలలో అభద్రతను, తీవ్రవాదాన్ని పెంపొందించింది. మనదేశంలో జిహాద్ కు ప్రేరణ లభించింది. నేడు పాకిస్తాన్ నుండి ఉత్తరాఫ్రికా వరకు అల్లకల్లోలంగా ఉంది. 

ఎం.జె. అక్బర్, ప్రముఖ పాత్రికేయులు