నిజమౌతున్న కల - 'కాంగీ ముక్త భారత్'

 
'నరేంద్రమోదీ పని ఇక అయిపోయింది. వేవ్ లు లేవు, గాలులు లేవు, రాబోయే ఎన్నికలలో మాదే గెలుపు' - అంటూ ఏవేవో పగటికలలు కంటున్న కాంగీ మరియు వారితో కుమ్మక్కైన ఇతర పార్టీల నాయకుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. హర్యానా, మహారాష్ట్రల శాసనసభలకు అక్టోబర్ లో జరిగిన ఎన్నికలలో ఫలితాలు చూసి కాంగీ & కంపెనీ నిర్ఘాంతపోయింది.

హర్యానా రాష్ట్రం 1966లో ఏర్పాటైనప్పటి నుండి 48 సంవత్సరాలుగా అధికకాలం పాటు అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కొంతకాలం స్థానిక పార్టీలు కూడా రాజ్యం చేశాయి. ఐతే 2014లో జరిగిన ఎన్నికలలో శాసనసభలోని మొత్తం 90 స్థానాలకుగాను భాజపా 47 స్థానాలలో గెలిచి, పూర్తి మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే క్రిందటిసారి భాజపాకు ఉన్నవి కేవలం 4 స్థానాలు మాత్రమే.

ఇక మహారాష్ట్ర విషయానికొస్తే మొత్తం 288 స్థానాలకుగాను భాజపా 122 స్థానాలలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నిన్నటివరకు భాజపాను తీవ్రంగా వ్యతిరేకించిన ఎన్.సి.పి. పార్టీ తనంతట తానుగా 'ఆకాంక్ష రహిత సమర్దన' (బేషరతు మద్దతు) ఇవ్వటానికి ముందుకొచ్చింది. బీడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలో భాజపా పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ప్రీతమ్ ముండే 6,96,321 ఓట్ల ఆధిక్యంతో గెలిచి, ఇంతటి ఆధిక్యంతో గెలిచిన మొదటి పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డు నమోదు చేశారు.

భాజపా తన విజయదుందుభిని కొనసాగించి కాంగ్రెస్ ముక్త భారత్ కలను నిజం చేయాలని మనమంతా ఆశిద్దాం.

- ధర్మపాలుడు