దేశద్రోహుల కుట్ర బయటపెట్టలేకపోతున్నప్రసార మాధ్యమాలు


భారతదేశంలో హిందువుల బ్రతుకు మద్దెల దరువులాగా ఉన్నది. ఒకవైపు ఇస్లామిక్ తీవ్రవాదుల దాడులు, మరొక వైపు పత్రికలు, ప్రసార మాధ్యమాలు హిందువులకు వ్యతిరేకంగా చేసే దుష్ప్రచారం. ఇస్లామిక్ దేశద్రోహుల కుట్రలు తెలిసి కూడా టివిలు వాటిని ప్రసారం చేయడం లేదని కేరళ ప్రజలు ఆక్రోశిస్తున్నారు. తిష్హూరు జిల్లాలోని వరవూరు గ్రామస్తులు చెప్పిన కొన్ని భయంకర వార్తలు వినండి. కేరళలో కొంతమంది దళితులకు వారి బ్యాంకు అకౌంట్ కు లక్షల కొద్దీ ధనం ప్రవాహం లాగా వచ్చి పడుతున్నది. ఈ దళితులు పేదవారు. డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని గూఢచారి వర్గాలు (RAW-IB) రహస్యంగా విచారించారు. కాశ్మీరులో స్టేట్ బ్యాంకు నుండి ధనం లష్కర్-ఏ-తోయిబా అనే తీవ్రవాదులు పంపుతున్నట్లు ఆధారాలతో సహా తెలుసుకున్నారు. ప్రతి పనికిమాలిన విషయం కూడా బ్రేకింగ్ న్యూస్ అని ఊదరగొట్టే టివిలు ఈ విషయం మీద మాత్రం మౌనం వహిస్తున్నాయి. కేరళ నుండి కొంతమందిని కాశ్మీరుకు తీసుకెళ్ళి తీవ్రవాద శిక్షణ ఇస్తున్న నజీర్ అనే దేశద్రోహి ఈ పని చేస్తున్నట్లు తెలిసింది. వీరి కుట్రలను బహిర్గతం చేసే బాధ్యత టివిలకు లేదా? అని ప్రజలు వాపోతున్నారు.  

- కేరళ నుండి అందిన వార్త

- ధర్మపాలుడు