హిందూ సంస్కృతిని పునరుద్ధరించాలి

జస్టిస్ ఎ.ఆర్.దవే
 
'మన సనాతన గురు-శిష్య పరంపర దెబ్బ తింటున్నది. పురాణాలు, భగవద్గీతల అధ్యయనం తగ్గుతున్నది. మనం హిందూ సంస్కృతిని గౌరవించి తిరిగి పునరుద్ధరించాలి, హిందూ విలువలు తగ్గిన కారణంగా ప్రపంచంలో అశాంతి రగులుతున్నది. తీవ్రవాదం జడలు విప్పి కరాళనృత్యం చేస్తున్నది' అన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఆర్.దవే. కర్ణావతి (గుజరాత్) లో జరిగిన అంతర్జాతీయ సదస్సు "Contemporary Issues & Challenges of Human Rights" లో ఉపన్యసిస్తూ జస్టిస్ దవే ఇంకా ఇలా అన్నారు - 'భగవద్గీత, మహాభారతాలను చిన్నప్పటి నుంచే పాఠశాలలో నేర్పించాలి, సెక్యులరిస్టుల అభ్యంతరాలు పట్టించుకోకూడదు, నేనే గనుక భారతదేశ నియంతను అయితే గీత-భారతాలను ఒకటవ తరగతి నుండే బోధించేలా చేస్తాను, మానవుని మాధవునిగా మలిచే శక్తి ఉన్నది మన శాస్త్రాలకే' అని ఘంటాపథంగా ప్రకటించారు జస్టిస్ దవే.
 
- ధర్మపాలుడు