ముందు తల్లి గొప్పదనాన్ని గురించి తెలుసుకో...


తల్లి నెరుగువాడు దైవంబు నెరుగును
మన్ను నెరుగువాడు మిన్ను నెరుగు
మిన్ను మన్నెరిగిన తన్ను తానెరుగు
విశ్వదాభిరామ వినురవేమ !


భావం : ఓ అభిరామా! తల్లి యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్నవాడు దైవమును గూర్చి తెలుసుకో గలుగుతాడు. భూమి యొక్క శక్తిని తెలుసుకున్నవాడు ఆకాశపు మహిమను గ్రహించగలుగుతాడు. భూమ్యాకాశముల రెంటిని గూర్చి తెలుసుకున్నవాడు తన్ను తాను తెలుసుకోగలుగుతాడు. అనగా ఆత్మసాక్షాత్కారం పొందగలుగుతాడు.