చైనా వలన మనకు ప్రమాదం ఉంది. జాగ్రత్త !

నెహ్రూకు సర్దార్ పటేల్ వ్రాసిన ఉత్తరం

హితవచనం

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్
 
'చైనాను మనం మిత్రదేశంగా భావిస్తున్నాం. కాని, చైనా మనలను తన స్నేహితులుగా భావించటం లేదు. మనలను ఏమార్చి టిబెట్ ను ఆక్రమించుకొంది. టిబెట్ ను మనం కాపాడలేకపోయాం. చైనా మనకు పంపిన చివరి టెలిగ్రామ్ చాలా అమర్యాదకరంగా ఉంది. టిబెట్ ను ఆక్రమించుకున్నందుకు మనం తెలిపిన నిరసనను చైనా తేలిగ్గా తీసుకుంది. భారతదేశ ఉత్తర, ఈశాన్య సరిహద్దులలో హిమాలయాల వెంబడి నివసించే ప్రజలకు జాతి సంస్కృతుల పరంగా చైనీయులతో కూడా కొద్ది పోలికలున్నాయి. ఇవి భవిష్యత్తులో మనకు సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. సామ్రాజ్యవాదం నుండి మనకు రక్షణకవచంగా కమ్యూనిజం ఉపయోగపడదు. సామ్రాజ్యవాదులకు - కమ్యూనిస్టులకు మధ్య పెద్దతేడా ఏం లేదు. మన ఉత్తర, ఈశాన్య సరిహద్దులలో నేపాల్, భూటాన్, సిక్కిం, డార్జిలింగ్, అస్సామీ గిరిజన ప్రాంతాలున్నాయి. అక్కడ మన రక్షణ ఏర్పాట్లు బలహీనంగా ఉన్నాయి. ఇది ప్రమాదకరం. మొత్తంమీద చైనా నుండి మనకు ప్రమాదం పొంచి ఉంది' అని ఈ ఉత్తరం ద్వారా పటేల్ నెహ్రూకు చాలా స్పష్టంగా తెలియచేశారు. మనదేశ దురదృష్టవశాత్తు దేశ ప్రధాని స్థానంలో ఉన్న నెహ్రూ - దేశ రక్షణ మంత్రి చెప్పిన ఆ విషయాలను ఏమాత్రం పట్టించుకోలేదు. 

నాడు ఆ ఉత్తరంలో పటేల్ వ్రాసిన విషయాలు అక్షరసత్యాలని ఆ తరువాతి కాలం నిరూపించింది. ఆనాడు నెహ్రూ అశ్రద్ధగా వ్యవహరించినందున ఆ తరువాత దేశం ఎంతో మూల్యం చెల్లించుకుంది.  అందుకే వ్యక్తిశీలంతో పాటు జాతీయ నిష్ఠ, జాతీయ శీలం గల నాయకులను మాత్రమే మనం మన దేశ నాయకులుగా ఎన్నుకోవాలి.