సంఘే శక్తి: కలౌయుగే

విజయదశమి సందర్భంగా ప్రత్యేక వ్యాసం  


ప్రపంచంలో ఏ దేశంలోనైనా సామాన్య వ్యక్తి సంసిద్ధతే ఆ దేశ శక్తి. సామాన్య వ్యక్తులలో వ్యక్తిత్వ వికాసము, దేశభక్తిని నిర్మాణం చేయాలి. అట్లా శిక్షణ పొందిన వ్యక్తుల భాగస్వామ్యం సమాజంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకొంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని దేశాలలో అక్కడి విద్యార్థులకు సైనిక శిక్షణ ఇస్తూ ఉంటారు. మనదేశంలో ప్రాచీన కాలంలో విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదువుకొని ఎంతో శిక్షణ పొందేవారు. జీవితానికి అవసరమైన శిక్షణ కూడా అక్కడే పొందేవారు. బ్రిటిష్ వాళ్ళు మనదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో కూడా మనదేశంలో స్వదేశీ పాఠశాలలు ఉండేవి. ఇట్లా ఈ కాలంలో సమాజంలో వ్యక్తులకు శిక్షణ ఇచ్చి దేశం, ధర్మం, సంస్కృతీ గురించి తెలియచేస్తూ ప్రేరణ ఇస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘము.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ప్రారంభించి వచ్చే విజయదశమి (అక్టోబర్ 24) కి 87 సంవత్సరాలు పూర్తి అయి 88వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. ఈ 87 సంవత్సరాల కాలఖండంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది.


ప్రపంచంలో ఏ దేశంలోనైనా సామాన్య వ్యక్తి సంసిద్ధతే ఆ దేశ శక్తి. సామాన్య వ్యక్తులలో వ్యక్తిత్వ వికాసము, దేశభక్తిని నిర్మాణం చేయాలి. అట్లా శిక్షణ పొందిన వ్యక్తుల భాగస్వామ్యం సమాజంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకొంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని దేశాలలో అక్కడి విద్యార్థులకు సైనిక శిక్షణ ఇస్తూ ఉంటారు. మనదేశంలో ప్రాచీన కాలంలో విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదువుకొని ఎంతో శిక్షణ పొందేవారు. జీవితానికి అవసరమైన శిక్షణ కూడా అక్కడే పొందేవారు. బ్రిటిష్ వాళ్ళు మనదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో కూడా మనదేశంలో స్వదేశీ పాఠశాలలు ఉండేవి. ఇట్లా ఈ కాలంలో సమాజంలో వ్యక్తులకు శిక్షణ ఇచ్చి దేశం, ధర్మం, సంస్కృతీ గురించి తెలియచేస్తూ ప్రేరణ ఇస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘము.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ప్రారంభించి వచ్చే విజయదశమి (అక్టోబర్ 24) కి 87 సంవత్సరాలు పూర్తి అయి 88వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. ఈ 87 సంవత్సరాల కాలఖండంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది.
 


సంఘం ప్రారంభించిన తొలి రోజుల్లో పూజనీయ డాక్టర్ జీ ఒకప్రక్క స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటూనే సంఘ పనిని ముందుకు తీసుకొని వెళ్ళారు. స్వాతంత్ర్యానంతరం పూజనీయ శ్రీ గురూజీ కాలంలో సంఘ కార్యకర్తలు సమాజానికి సంబంధించిన  రంగాలలో పనులు ప్రారంభించారు. ఆ సంస్థలు ఈ రోజున దేశంలో అగ్రస్థానంలో నిలబడ్డాయి. వాటి శక్తి సమాజ హితానికి ఉపయోగపడుతున్నది. పూజనీయ బాలాసాహెబ్ జీ కాలంలో చూస్తే సమాజంలోని అట్టడుగు వర్గాల దగ్గరకు మనం ఎట్లా వెళ్ళాలి? దానిగురించి ఆలోచించి చేసిన నిర్ణయం సేవ. సేవా కార్యక్రమాల మాధ్యమంగా సేవా భారతి ఈ రోజున అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నది. దేశవ్యాప్తంగా అనేక మంచి ఉదాహరణలు సమాజం ముందున్నాయి. 1990లో సేవాభారతి ఏర్పడింది. ఈ రోజున పని ఎంతగా విస్తరించింది అంటే సమాజంలో స్వయంసేవకులే కాక సమాజ హితం గురించి సేవా రంగంలో పని చేస్తున్న వారినందరిని కలుపుకొంటూ పోతున్నది. కాలక్రమంలో రాష్ట్రీయ సేవాభారతిగా అది వికసించింది. ఈ రోజు లక్షా యాభై వేలకు పైగా సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. పూజనీయ రజ్జూభయ్యా కాలంలో సంఘం విశ్వవ్యాప్తమైంది. ప్రపంచంలో ఎక్కడెక్కడ హిందువులు ఉన్నారో అక్కడక్కడకు సంఘ కార్యకర్తలు వెళ్లి, వారిలో మన సంస్కృతీ, మనదేశం యెడల శ్రద్ధను నిర్మాణం చేసే పని ప్రారంభించారు. ఈ పని ఈ రోజున ఎంతో ప్రభావవంతంగా కనబడుతున్నది. ఆ రోజుల్లోనే ఆర్ధిక సరళీకరణ కారణంగా తలెత్తబోయే పరిస్థితులను అధిగమించెండులు  మన ఆర్ధిక వ్యవస్థ స్వావలంబన దిశగానే ఉండాలి. దానికి అనేక కార్యక్రమాలు తీసుకొని పని చేయడం జరుగుతున్నది. ఆ స్వదేశీ ఉద్యమం ప్రారంభంలో ఆదరణకు నోచుకోలేదు. కాని కొద్ది సంవత్సరాలలో మేధావులు గుర్తించారు. ఈ రోజున ప్రభుత్వంలో ఉండే వారు కూడా స్వదేశీ జాగరణ మంచ్ కార్యకర్తలతో సంబంధాలు నెరపడం గమనించవచ్చు.  ఈ రకంగా ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. పూజనీయ సుదర్శన్ జీ  కాలంలో ఈ స్వదేశీకి ఇంకా ఎక్కువగా ప్రాదాన్యతనిచ్చి పని చేస్తూనే, దేశ ఆర్ధిక వ్యవస్థకు కీలకం గ్రామం కాబట్టి గ్రామ స్వయంసంరుద్ధికి ఏ పనులు ఉపయోగపడతాయి? పాత క్రొత్తల మేలు కలయిక ఎట్లా? ఈ విషయాల గురించి ఆలోచించటం ప్రారంభమైంది. ఈ కాలంలోనే విశ్వమంగళ గోగ్రామయాత్ర జరిగింది. ఈ యాత్రను సంకల్పం చేసి దాని నిర్వహణకు దేశవ్యాప్తంగా తిరిగినప్పుడు అంతగా ఎవరికీ విశ్వాసం కనబడలేదు. కాని ఒకసారి యాత్ర ప్రారంభమైన తరువాత సామాన్య ప్రజలలో గోవు యెడల ఎంతో శ్రద్ధ నిర్మాణమయిందనేది మనకు అర్థమవుతూ వచ్చింది. యాత్ర పూర్తి అయిన తరువాత దేశవ్యాప్తంగా ఒక పరివర్తన వేగంగా చోటు చేసుకొంటున్నది. గోశాలలు ప్రారంభం కావటం, గో ఆధారిత వ్యవసాయం, గో ఆధారిత, ఆరోగ్య రక్షణ ఔషధాలు విశేష ప్రాచుర్యాన్ని పొందుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితులను దగ్గరగా గమనిస్తే రాబోవు రెండు మూడు దశాబ్దాలలో భారత ఆర్థిక వ్యవస్థకు గోవు కేంద్ర బిందువు కావచ్చు.

అట్లాగే పూజనీయ శ్రీ గురూజీ శతజయంతి ఉత్సవాల సమయంలో చేపట్టిన కార్యక్రమాల కొనసాగింపుగా ఈ దేశంలో సామాజిక నాయకత్వాన్ని పనిలోకి తీసుకొని రావాలనే ప్రయత్నం జరుగుతున్నది. ఈ రోజున దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు అందరం ఎట్లా కలిసి పనిచేయాలి వంటి విషయాల గురించి పరస్పర అవగాహన కోసం ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అందరి మధ్య అభిప్రాయాలలో సారూప్యత కనబడుతున్నది. ఇది అందరిలో విశ్వాసం నిర్మాణం చేస్తున్నది. ఈ దిశలో పనులను వేగంగా ముందుకు తీసుకొని వెళ్లేందుకు ప్రస్తుత సర్ సంఘచాలక్ పూజనీయ మోహన్ జీ భాగవత్ ఆధ్వర్యంలో విశేషంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఘం ఈ రోజున సమగ్ర సమాజం యొక్క పని చేస్తున్నదని అందరికి అర్థమవుతున్నది.దేశంలో ఎదురవుతున్న సమస్యలకు స్పందించి ఉద్యమించటం, ప్రజలను చైతన్యం చేయటం ఒకవైపు జరుగుతూ ఉంటే రెండవ వైపు దేశంలో సమూల మార్పుకు చేయవలసిన పనులు చేసుకొంటూ నిశబ్దంగా సంఘం ముందుకు పోతున్నది. సంఘం దేశంలో నెలకొల్పిన కొన్ని నమూనాలు దేశ ప్రజలలో, సంఘ స్వయంసేవకులలో విశ్వాసాన్ని నిర్మాణం చేస్తున్నాయి. అవి వివేకానంద రాక్ మెమోరియల్, చిత్రకూట్, దేవలాపాల్ వంటివి. ఇట్లా చెప్పుకొంటూపోతే అనేకం. ఇటువంటి పనులను చేసేందుకు యోగ్యులైన వ్యక్తులను ముందుకు తీసుకొని వచ్చి వారి బాధ్యతను గుర్తు చేస్తున్నది. ఈ 87 సంవత్సరాలలో ఈ సమాజం ఒక ఎదురులేని శక్తిగా నిర్మాణమైంది. సంఘంతో పోలిన వ్యవస్థ ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో మరొకటి లేదు. సంఘం అంటే సమగ్ర సమాజం. అంతేకాని సంఘం సమాజంలో ఒక సంస్థ కాదు. ఈ విషయం ఈ రోజున అందరికీ అర్థమవుతున్నది. సంఘం ద్వారా హిందూ సమాజం శక్తివంతం అవుతున్నది. అదే ఈ కలియుగ అవసరం.

సంఘానికి మరే ఇతర సంస్థలతో పోలిక లేదు. ఈ సందర్భంగా రామాయణంలోని ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం.

గగనం గగనాకారం - సాగరం సాగరోపహం
రామరావణయోర్యిద్ధం - రామరావణ యోరివ 

ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చగలుగుతాం. సముద్రాన్ని సముద్రంతోనే పోల్చగలుగుతాం. అట్లాగే సంఘాన్ని దేనితో పోల్చగలుగుతాం అంటే సంఘంతోనే పోల్చగలుగుతాం. దీనిని మనం అర్థం చేసుకొని ఈ పనులు వేగవంతం చేసేందుకు కృషి చేద్దాం.