ఓ సుజాత కథ !

 
హైదరాబాద్ కు చెందిన సుజాత జడ్చర్లకు చెందిన వెంకటేశ్ (మేస్త్రీ) తో 1998లో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ఈ మధ్య వెంకటేశ్ కు శంషాబాద్ దగ్గర ఉన్న క్రైస్తవులతో సంబంధం వచ్చింది. వాళ్లు ఏమి చెప్పారో తెలియదు కానీ వెంకటేశ్ క్రైస్తవుడిగా మారాడు. తన భార్య సుజాతను కూడా మారమని వత్తిడి చేసాడు. తను పుట్టిన మతం మారే ప్రసక్తి లేదని తెగేసి చెప్పింది. దానితో ఘర్షణలు ప్రారంభమైనాయి. చివరకు సుజాత పోలీసులను ఆశ్రయిస్తే పోలీసుల నుండి నర్మగర్భంగా ఆమె కావాలని కోరితే ఇది ఇంకో ప్రమాదానికి దారితీస్తున్నదని ఆమె నేరుగా కలెక్టర్ గిరిజా శంకర్ ను ఆశ్రయించింది. జిల్లా కలెక్టర్ ఎస్పీకి బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసు మళ్లీ జడ్చర్ల పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. ప్రారంభంలో అక్కడ తనకు న్యాయం దొరకకనే కలెక్టర్ ను కలిస్తే కథ మళ్లీ మొదటికి వచ్చంది. ఇక నన్ను ఎవరు కాపాడతారని ఆమె పత్రికా విలేకరులతో వాపోయింది. హిందూ కుటుంబాలలో క్రైస్తవం చిచ్చుపెడ్తున్న సందర్భాలు అనేకం. ఇటువంటి ఘర్షణలకు కారకులవుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. అటువంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. 
 
- ముప్పిడి మహేష్ కుమార్