మోహ, లోభాలను వదిలించుకోవాలి

ఏరిన ముత్యాలు - వేమన శతకము

మోహాన్ని విడిచిపెడితే జ్ఞానం లభిస్తుంది

మోహ లోభములను మొనయుట బహు కీడు
మోహముడిగెనేని ముక్తుడగును
లోభముడిగెనేని లోకంబుల నెరుగు
విశ్వదాభిరామ వినురవేమ !


భావం : ఓ అభిరామా ! మోహము, లోభము వంటి గుణములు మానవునిలో ఎక్కువైతే ఎంతో ముప్పు కలుగుతుంది. మోహాన్ని విడిచిపెడితే ముక్తి లభిస్తుంది. లోభాన్ని విడిచిపెడితే లోకం గురించి తెలుసుకొని మహాజ్ఞాని అవుతాడు.