జాతి రత్నం శ్రీ ఆది శంకరులు

శ్రీ ఆది శంకరాచార్య
వైశాఖ శుద్ధ పంచమి (ఏప్రిల్ 26) వచ్చింది, వెళ్ళింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం గమనించనేలేదు. ఏం? ఎందుకు గమనించాలి? అని ఎవరైనా అడగవచ్చు. భారతమాత ప్రియ పుత్రుడు, హిందూ ధర్మ రక్షకుడు అయిన శ్రీ ఆది శంకరులు జన్మించిన తిథి వైశాఖ శుద్ధ పంచమి. ఎనిమిది సంవత్సరాల పసి ప్రాయంలో నాలుగు వేదాలను ఔపోశన పట్టిన ఘనుడు. బాల్యంలోనే సన్యాస దీక్ష స్వీకరించి ఆసేతు హిమాచలం కాలి నడకన తిరిగి హిందూ ధర్మ పునరుద్ధరణ చేసినవాడు. ఇంత మహిమాన్వితుడైన శ్రీ ఆది శంకరుని జయంతిని గురించి మన ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు.

మహావీర్ జయంతి, బసవేశ్వర జయంతి, బుద్ధ పూర్ణిమ, హజరత్ అలీ జయంతి, మహమ్మద్ ప్రవక్త మరియు క్రీస్తు జయంతి - ఇవన్నిటికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ పైవేవీ దేశవ్యాప్తంగా జరుపుకొనే జయంతులు కావు. ఆది శంకరాచార్యులు దేశవ్యాప్తంగా ప్రతి హిందువుకు పూజనీయుడు. కాని వారి జన్మదినం శెలవుదినం కాకపోవటం విచారకరం. ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. 

- ధర్మపాలుడు