క్రైస్తవులకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వస్తున్నది?

కలియుగాబ్ది 5115 , శ్రీ జయ నామ సంవత్సరం,
  కార్తీక మాసం

 
తిరుపతిలో కొద్ది సంవత్సరాల తరువాత మళ్ళీ క్రైస్తవులు మతప్రచారం చేయడానికి పెద్దఎత్తున సాహసించారు. వివరాలలోకి వెళితే మొండితోక సుధీర్ అనే పాస్టర్ తిరుపతిలో క్రైస్తవ మతప్రచారానికి పాల్పడ్డాడు. తిరుమలలో క్రైస్తవ మత ప్రార్థనలు చేయడం, హిందూ దేవీదేవతలను దూషించటం కూడా చేశాడు. పైగా దీనిని రికార్డు చేసి యూట్యూబ్ లో పెట్టాడు. ఈ పాస్టర్ కు ఇంత ధైర్యం ఎక్కడినుండి వచ్చింది? క్రైస్తవులు తమ ప్రార్థనా స్థలాలలో కాకుండా ఇతర మతస్తుల ప్రార్థనా స్థలాలలో ప్రార్థన చేసేందుకు ఎందుకు బరితెగిస్తున్నారు? వాళ్ళ మత ప్రబోధంలోనే ఇలా చేయమని ఉన్నదా? క్రైస్తవుల సభలలో, ప్రచారాలలో తమ మతం గురించి చెప్పుకోవడం కన్నా, ఇతర మతాలలోని దోషాలను ఎత్తి చూపించేందుకు, ఇతర మతాలను దూషించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇటువంటి ప్రచారాలు చాలాచోట్ల సమస్యలకు కారణమవుతున్నాయి.  
 
వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందువుల దేవాలయాల దగ్గర మతప్రచారం చేస్తుంటే గొడవలయినాయి. వాళ్ళ దుష్కృత్యాలను పత్రికలు కూడా విమర్శించాయి. తిరుపతిలో కూడా అన్యమత ప్రచారం జరిగింది. చివరకు ప్రభుత్వం ఇతర మతాల పవిత్ర స్థలాలలో క్రైస్తవులు మతప్రచారం చేయడాన్ని నిషేధిస్తూ చట్టం చేసిన విషయం అందరికీ తెలిసిందే. 
 
చట్టపరంగా నిషేధం ఉందని తెలిసీ ఎందుకు క్రైస్తవులు ఇలా చేసేందుకు సిద్ధపడుతున్నారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అనేక ప్రదేశాలలో, అనేక గ్రామాలలో కుటుంబాల మధ్య చిచ్చులుపెట్టిన సంఘటనలు అనేకం కేసులుగా నమోదయ్యాయి. మతంమార్పిడుల పేరుతో కుటుంబాలను చీల్చిన సంఘటనలు ఉన్నాయి. క్రైస్తవమతం ఇలాగే చేయమని చెబుతున్నదా? బహుశ అదే ఉన్నట్లుంది. ప్రపంచంలో అనేక దేశాలలో ఘర్షణలకు ఇదే కారణమా? పరమత అసహనాన్ని బోధించే ఆ మతం గురించి హిందూసమాజం అర్థం చేసుకోవాలి. ఎవరి పాపాన వారే పోతారులే అని హిందూ సమాజం సరిపెట్టుకుంటూ ఉండవచ్చు. వాడి పాపాన వాడు పోకుండా మరికొంతమందిని పాపులుగా తయారుచేస్తున్నాడు. ఇది హిందూ సమాజానికి పెద్ద లోటుగా ఏర్పడుతున్నది. ఆ లోటు పెరిగేకొద్ది హిందూసమాజానికి కష్టాలు తప్పవు. ఇది హిందూసమాజానికి అర్థమయ్యి, వాళ్ళను హెచ్చరించేవరకు క్రైస్తవులు కార్యకలాపాలు ఇలాగే కొనసాగుతాయి. అంతవరకు ధైర్యంగా మనలను తిడుతూనే ఉంటారు.  
 
మొండితోక సుధీర్ ను అదుపులోకి తీసుకున్నారు గాని, మరొక మొండితోక తయారుకాకుండా చూడవలసిన బాధ్యత హిందువులమైన మనమీదే ఉన్నది.