ఆవు వెన్నతో మొలలు మాయం

గృహ వైద్యము - 2

ఆవు వెన్న

మొలలు లేదా ఆర్ష మొలలు : 

ఎక్కువగా సీట్లో కూర్చుని పనిచేసే వారికి వచ్చే సాధారణ వ్యాధి మొలలు లేదా ఆర్ష మొలలు. ఈ వ్యాధినే 'పైల్స్' అని కూడా అంటారు. ఈ వ్యాధిని తగ్గించుకోవాలంటే .. 

  • ఆవు వెన్న, నువ్వులు సమానంగా కలిపి రోజుకు రెండుసార్లు చొప్పున ఒక వారం రోజులపాటు తినాలి. దీంతో మొలల వ్యాధి నశిస్తుంది.  
  • స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒక టీ స్పూను తీసుకొని, ఒక గ్లాసు స్వచ్ఛమైన ఆవు పాలలో కలుపుకొని ప్రతిరోజూ త్రాగుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే కొన్ని రోజులకు మొలలు రాలిపోతాయి.

అతి దాహం : 

ఒక్కొక్కసారి ఎన్ని నీళ్ళు త్రాగినను దప్పిక తీరని పరిస్థితి ఎందుర్కొంటాము. ఆ స్థితిలో.. 

దనియాలు

  • కొన్ని చలువ మిరియాలను నోటిలో వేసుకొని చప్పరిస్తుంటే అతిదాహం తగ్గుతుంది. 
  • దనియాలను కషాయముగా కాయాలి. ఆ కషాయాన్ని 20 20 20 నుండి 30 మి.లీ. తీసుకొని తగినంత పంచదార కలుపుకొని త్రాగాలి. దానితో అతిదాహం హరిస్తుంది.

అరుచి :  

కొంతమందికి ఎంత రుచికరమైన పదార్థం తిన్నా రుచిగా అనిపించదు. దీనినే అరుచి అంటారు. దానిని అధిగమించడానికి .. 

కరక్కాయ

  • ఉప్పు మరియు అల్లము కలిపి ప్రతిరోజూ భోజనం చేసేముందు తీసుకోవాలి. 
  • ఎండు ద్రాక్ష పండ్లు, కరక్కాయ మరియు కండ శర్కర  తీసుకొని మెత్తగా దంచి పొడి చేసి ఉంచుకోవాలి. ఈ పొడిని 2 నుండి 4 గ్రాముల వరకు గోరువెచ్చని నీళ్ళతో రోజుకు రెండు సార్లు తీసుకొంటూ ఉంటే నోట్లో అరుచి తగ్గిపోయి ఆకలి పెరుగుతుంది.

- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..