తీవ్రవాదులకు విదేశీ విరాళాలు అందడం నిషేధం

 
ఐరోపా ఖండంలో జర్మనీ దేశం ప్రక్కన ఉన్న చిన్న దేశం 'ఆస్ట్రియా'. ఈ దేశం కూడా ముస్లిం తీవ్రవాద బాధిత దేశమే. వారి పార్లమెంటు ఇటీవల ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం దేశంలో ఉన్న ఏ ఒక్క ముస్లిం సంస్థకూ విదేశాల నుండి నిధులు అందరాదు. అంతేకాదు, ఆ చట్టం ప్రకారం దేశంలో ఉన్న "ఇమామ్"లు అందరూ కూడా జర్మన్ భాష నేర్చుకోవాలి. ఆ భాషలోనే వ్యవహరించాలి. సమైక్యతా మంత్రిత్వ శాఖ మంత్రి సెబాస్టియన్ కుర్డ్స్ "ఇస్లాం ఆఫ్ యూరోపియన్ కారెక్టర్" అనే ఒక విధానపత్రం రూపొందించారు. దానిప్రకారం దేశంలోని ముస్లింలు అందరూ కూడా ఆస్ట్రియా దేశానికి విధేయులై ఉండాలి. సంస్కృతిని గౌరవించాలి. విదేశీభక్తి కూడదు. ప్రపంచంలోని చిన్నాపెద్దా దేశాలు అన్నీ కూడా తమదేశ భద్రత కొరకై చర్యలు తీసుకుంటున్నారు. 
 
మరి భారతదేశం ఇకనైనా కళ్లు తెరుస్తుందా? వేచి చూద్దాం.

- ధర్మపాలుడు