విజయవంతంగా జలాంతర్గత క్షిపణి ప్రయోగం


భారత్ నౌకాదళం అమ్ముల పొదిలోఇంకొక శక్తివంతమైన క్షిపణి వచ్చి చేరింది. నౌకాదళం అధ్యక్షుడు అడ్మిరల్ డి.కె. జోషి ఇచ్చిన సమాధానం ప్రకారం విశాఖపట్నంలో భారత యుద్ధ జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్. అరిహంత్ అణు ఆయుధాలను మోసుకుపోగల (ప్రయోగించగల) సామర్థ్యం గలది. 

SLMB అనబడే ఈ జలాంతర్గత అణు క్షిపణిని అరిహంత్ జలాంతర్గ నౌక ద్వారా సముద్రపు నీటి లోపలి నుండి ప్రయోగించారు. ఈ క్షిపణి 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఛేదించే శక్తి కలది. ఒక టన్ను వరకు అణు ఆయుధాలను ప్రయోగించగలదు. అతి త్వరలో 10 టన్నుల వరకు దీని శక్తిని పెంచబోతున్నారు. ఈ క్షిపణిని విశాఖపట్నం నుండి ప్రయోగించి పరీక్షించారు.

ప్రస్తుతం ఇంత శక్తిగల క్షిపణులు అమెరికా, రష్యా, చైనాల దగ్గర మాత్రమే ఉన్నాయి.

- ధర్మపాలుడు