మరో ప్రపంచం "ఛీ" అంది


"మరో ప్రపంచం.. మరో ప్రపంచం.. మరో ప్రపంచం పిలిచిందీ.. పదండి పోదాం.. దూసుకు పైపైకీ.." అని పాడుకుంటూ త్రోసుకువెళుతున్న కమ్యూనిస్టులు బోర్లాపడ్డారు. మట్టికఱిచారు.

ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికలలో పోటీ చేసిన వామపక్ష పార్టీల అభ్యర్థులందరూ ఓడిపోవటమే కాక, అందరూ ధరావతు కూడా కోల్పోయారు. ఈ ఎన్నికలలో సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎం.ఎల్.), ఎస్.యు.సి.ఐ., పార్వర్డ్ బ్లాక్, ఆర్.ఎస్.పి. తదితర వామపక్ష పార్టీలన్నీ పోటీచేశాయి. ఏడు పార్టీలకు చెందిన 15 మంది వామపక్ష అభ్యర్థులు అందరూ కలసి కనీసం వెయ్యి ఓట్లు కూడా సాధించలేకపోయారు. 

మరో ప్రపంచం సంగతి ఏమోగాని, ఒక మహానగరంలో కనీసం ధరావతు కూడా పొందలేకపోయారు మన ఎఱ్ఱ సోదరులు.

- ధర్మపాలుడు