ఇంగ్లీషులో మన అప్పడం

 
"భారతీయ ఆహారం ఎంతో రుచికరం, నిండా ఆరోగ్యకరం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టి చాలా భారతీయ పదార్ధాల పేర్లు ఆంగ్లభాషలో భాగమైపోతున్నాయి" అన్నారు పాట్రిక్ వైట్. వీరు ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డు విశ్వవిద్యాలయం, నిఘంటువుల విభాగం ప్రధానాధికారి. క్రొత్తగా విడుదల చేసిన Oxford Advanced Learner's Dictionary తొమ్మిదవ సంపుటంలో 240 భారతీయ పదాలు ఉన్నాయి. వీటిలో 60 శాతం హిందీపదాలు. క్రొత్తగా చేరిన పదాలలో పాపడ్ (అప్పడం), కీమా (సన్నగా నరికిన మాంసం) కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు వెయ్యి భారతీయ పదాలు ఆంగ్లంలో చోటు దక్కించుకున్నాయి అన్నారు పాట్రిక్ వైట్.
 
- ధర్మపాలుడు