ప్రపంచమంతటికి వర్తించేది హిందుత్వం

ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘచాలక్ మాననీయ శ్రీ మోహన్ జీ భాగవత్
 
శ్రీ మోహన్ జీ భాగవత్
 
"ప్రపంచమంతటికి వర్తించేంది హిందుత్వం మాత్రమే" అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్ సంఘచాలక్ మాననీయ శ్రీ మోహన్ జీ భాగవత్ పేర్కొన్నారు. హిందుత్వానికి సంబంధించిన 11 పుస్తకాల సంపుటి ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీ మోహన్ జీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అనేకమంది ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. 
 
శ్రీ మోహన్ జీ భాగవత్ చేతులమీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. అనంతరం శ్రీ మోహన్ జీ ప్రసంగిస్తూ -"హిందుత్వం అనేది కేవలం భారతీయులకు మాత్రమే కాక, ప్రపంచంలోని అందరికి వర్తించేది" అని అన్నారు. 
 
ఈ 11 పుస్తకాల సంపుటి రూపకల్పనలో 25 సంవత్సరాల పాటు అనేకమంది ధార్మిక పెద్దలు, సామాజిక పెద్దలు మొత్తం 1000 మంది కలిసి పనిచేశారు. ఈ గ్రంథావళిలో హిందూ సంస్కృతి గురించి, శాస్త్ర సాంకేతిక విషయాల గురించి అనేకమంది ప్రముఖులు వ్రాసిన వ్యాసాలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే హిందుత్వానికి చెందిన సమగ్ర గ్రంథం ఇది.