చైనా మడత పేచీ


ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టించకపోతే చైనాకు నిద్ర పట్టదు. చైనాతో ఏదో ఒక సమస్య లేని దేశం ఆసియా ఖండంలోనే లేదంటే అతిశయోక్తి కాబోదు. హిమాలయాలు నావే, శిఖరాలు నావే, అరుణాచలం నాదే అంటూ ఎప్పుడూ ఏదో ఒక సమస్య. 

కాశ్మీరులో నివసించే భారతీయులకు "స్టేపుల్డ్ వీసాలు" ఇచ్చి కలకలం రేపిన చైనా ఇప్పడు క్రొత్తగా అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ లను తమ భూభాగాలుగా చిత్రిస్తూ ఒక మ్యాప్ ను ఈ వీసాలతో కలిపి ఇస్తూ సమస్య సృష్టించింది. అయితే దీనికి ప్రతిగా భారతదేశం కూడా చైనా వారికి ఇచ్చే వీసాలలో మ్యాప్ ను ముద్రించి అరుణాచలం - అక్సాయ్ చిన్ లు చిత్రంలో చూపించటం మొదలుపెట్టింది. దీనితో ఖంగు తిన్న చైనా "ఈ -వీసా" లు ఇచ్చేటప్పుడు తన కపట బుద్ధిని తాత్కాలికంగా నిలిపి వేసింది. 

కుక్కతోక వంకర అన్నట్లు, ఈ బుద్ధి చైనాకు ఎన్నాళ్ళుంటుందో వేచి చూడాలి.

- ధర్మపాలుడు