మా గ్రామానికి వస్తే ఖబడ్దార్ !

క్రైస్తవ మత ప్రచారకులకు గ్రామస్తుల హెచ్చరిక

నిజామాబాద్ జిల్లా మద్నూరు మండలంలో హిందూ ఐక్యత


తమ హిందూ ధర్మాన్ని రక్షించుకునేందుకు గ్రామస్తులంతా ఏకమైన సంఘటన ఇది. నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలం వేమూరు గ్రామ ప్రజలు ఎంతో కాలంగా హిందూ ధర్మ స్ఫూర్తితో ఐకమత్యంగా జీవిస్తూ వస్తున్నారు. గ్రామంలో జరిగే ప్రతి ఉత్సవం ప్రజలంతా ఒకే కుటుంబంగా కలిసి మెలిసి జరుపుకుంటారు. అంతేకాదు, ఆ గ్రామంలో ఒక్క చర్చి కూడా లేదు. 

ఆ గ్రామ ప్రజల ఐకమత్యంపై క్రైస్తవ మత ప్రచారకుల కన్ను పడింది. ఆ గ్రామంలో ఎలాగైనా సరే క్రైస్తవాన్ని ప్రవేశపెట్టి ప్రజలను మతపరంగా విడదీసి తద్వారా రాజకీయ లబ్దిని పొందాలనేది వారి ఆలోచన. ఈ క్రమంలో యాభై మందితో కూడిన జిత్తులమారి క్రైస్తవ ప్రచారకుల బృందం వివిధ వాహనాలలో మద్నూరు మండలంలోని మేనూరు గ్రామానికి చేరుకుంది.

ఇక ఇంటింటికి తిరుగుతూ హిందూ దేవీ దేవతలను దూషిస్తూ, క్రైస్తవ మతంలోకి మారాల్సిందిగా బలవంతం చేయడం ప్రారంభించారు. తాము పవిత్రంగా భావించి పూజించే దేవుళ్ళను దూషిస్తూ ఉంటే పౌరుషం గల ఆ గ్రామ ప్రజలు సహించలేక పోయారు. క్షణాల్లో గ్రామస్తులంతా సంఘటితమయ్యారు. ఒక గ్రామంలో క్రైస్తవం ప్రవేశిస్తే జరిగే అనర్థాలు వారికి బాగా తెలుసు. జిత్తులమారి క్రైస్తవ మత ప్రచారకులను చుట్టుముట్టారు. తమ గ్రామాన్ని వీడి వెళ్లవలసినదిగా హెచ్చరించారు. 

ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు "మతప్రచారం చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు" అంటూ క్రైస్తవులకు వంత పాడారు. ఇంతలో ఆ గ్రామంలోని తెలివైన యువకుడు ముందుకు వచ్చి "క్రైస్తవులు వినిపిస్తున్న బోధనలను అంగీకరించక పోవడం కూడా రాజ్యాంగం కల్పించిన హక్కే, బలవంతపు మతప్రచారం రాజ్యాంగ విరుద్ధం. దైవదూషణ, మనోభావాలను దెబ్బ తీయడం వంటివి కూడా చట్టప్రకారం శిక్షార్హమైనవి" అని స్పష్టం చేయడంతో పోలీసులు వెనక్కు తగ్గి క్రైస్తవ మతప్రచారకులను వెనక్కు పంపివేశారు. "మా గ్రామానికి వస్తే ఖబడ్దార్!" అంటూ మేనూరు గ్రామ ప్రజలు క్రైస్తవ మతప్రచారకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హిందూ సంఘటన అంటే ఇదే.

- అయ్యలసోమయాజుల