జెండర్ బడ్జెట్ తో సాధికారత సాధ్యమా?


దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను అధిగమించడానికి కేంద్రప్రభుత్వం వర్మ కమిషన్ నియమించడం, ఫాస్ట్ ట్రాక్ కోరు్టలు ఏర్పాటు చేయడం తెలిసిందే. మహిళాభివృద్ధికై ప్రత్యేకించి "జెండర్ బడ్జెటింగ్" విధానం ప్రకటించింది. 

ఈ "జెండర్ బడ్జెటింగ్"లో భాగంగా 2012 డిసెంబర్ లో అత్యాచారానికి గురై మృత్యువాత పడిన ఢిల్లీ యువతికి 'నివాళి'గా "నిర్భయ నిధి"ని కేంద్రం ప్రకటించింది. ఈ నిధికి రూ.1000 కోట్లు కేటాయించింది. ఈ నిధిని మహిళల రక్షణ, భద్రత కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 

 

మహిళల అభివృద్ధికై ప్రభుత్వం ప్రకటించిన మరొక పథకం మహిళా బ్యాంకు ఏర్పాటు చేయడం. ఈ ప్రభుత్వ బ్యాంకుకు వంద కోట్లు ప్రభుత్వమే సమకూర్చనుంది. ఈ బ్యాంకు ప్రధానంగా మహిళా వ్యాపారవేత్తలకు ఋణాలివ్వడం, స్వయంసహాయక బృందాలకు మద్దతివ్వడం జరుగుతుంది. ఈ బ్యాంకు నిర్వహణ, లావాదేవీలన్నీ మహిళలే కేంద్రంగా సాగుతాయి. 

ఈ జెండర్ బడ్జెట్ కు 2013-14 సంవత్సరానికి రూ.97,134 కోట్లు కేటాయించడం జరిగింది. మొత్తం బడ్జెట్ లో ఇది కేవలం 5.8% మాత్రమే. ఇంత మాత్రాన ప్రభుత్వం తన బాధ్యత తీరిందనుకుంటే సరిపోదు. వర్మ కమిషన్ రిపోర్టు అమలు పరిచినప్పుడే మహిళా సాధికార సాధ్యమౌతుంది. 
- బి.స్రవంతి