మనిషి కాటుకి మందు లేదు - తస్మాత్ జాగ్రత్త..


"మనిషి కాటుకి మందు లేదు" అనేది సామెత. "ఖలునకు నిలువెల్ల విషమె కదరా సుమతీ"  అని నీతిశతకకారుడు అన్నాడు. ఇవన్నీ నిజమేనని నిరూపించే సంఘటన ఒకటి తమిళనాడులో జరిగింది. నవంబర్ 14, శుక్రవారంనాడు తమిళనాడులో 'బొల్లారపేట'కు చెందిన ఒక 50 సంవత్సరాల వృద్ధుడిని ఒక 20 సంవత్సరాల యువకుడు అదేపనిగా కరిచాడు. ఫలితంగా వైద్యం చేసినప్పటికి ఆ వృద్ధుడు మరణించాడు. పాము కరిచినా బ్రతికినవాళ్ళు ఉన్నారు. కాని మనిషి కరిస్తేనో? తస్మాత్ జాగ్రత్త !

- ధర్మపాలుడు