అడగ్గానే విడాకులా !

భారతీయ దంపతులు (గూగుల్ ఫోటో)
ఈ మధ్య మన కేంద్ర ప్రభుత్వం వివాహాల చట్టాల సవరణ బిల్లు 2011ను పార్లమెంటు ముందుకు తెచ్చింది. ఆ బిల్లులో విడాకులిచ్చేందుకు నిర్ణయించిన సమయాన్ని తగ్గించాలనే ప్రతిపాదన ఉంది. ఇది చాల ప్రమాదకరమైనది. దంపతులకు విడాకులు మంజూరు చేసే వ్యవధి తగ్గించవద్దని, అట్లా చేస్తే వివాహిత మహిళ హక్కులకు భంగం కలుగుతుందని, ఇది పాశ్చాత్య సంస్కృతిని ఆహ్వానించటమేనని పార్టీలకతీతంగా సభ్యులందరూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వ్యతిరేకించారు. ఇప్పటికే అనేక చిక్కులు వస్తున్న నేటి పరిస్థితులలో వివాహచట్ట సవరణ చేస్తే కుటుంబ వ్యవస్థ పూర్తిగా బలహీనపడే అవకాశాలున్నాయి. దీనికి సజీవ ఉదాహరణ అమెరికా. అక్కడ కుటుంబ వ్యవస్థ బలహీనపడి  సింగిల్ పేరెంట్ సమస్య నెదుర్కొంటోంది. అంటే తల్లి లేక తండ్రి ఎవరో ఒకరి చేతిలో పిల్లలు పెరగటం. దీని కారణంగా అక్కడి పిల్లలలో నేర ప్రవృత్తి బాగా పెరుగుతున్నది. అమెరికాలో సులభతర విడాకుల చట్టాలున్నాయి. మన దేశానికి ఇది తగినది కాదు. ఇటువంటి చట్టాలను పార్టీలకతీతంగా అందరూ వ్యతిరేకించాలి.