స్త్రీల సమస్యలు - పరిష్కారాలు

గృహ వైద్యము - 21
 
 
స్త్రీలు గర్భము ధరించుటకు
రావిచెట్టు పండ్లను తెచ్చి నీడలో ఆరబెట్టి, చూర్ణము చేసి ప్రతిరోజూ రాత్రిపూట 4 గ్రాముల పొడిని వేడిపాలలో కలిసి సేవించినచో గొడ్రాలు అయిన స్త్రీ కూడా నలభై రోజులలో గర్భము ధరించును.

స్త్రీలలో పాలు వృద్ధి చెందుటకు
  • ప్రత్తి గింజలను మెత్తగా పొడిచేసి 2 గ్రాములు పొడిని పాలలో కలిపి సేవించిన ప్రసూతి స్త్రీలలో స్తన్యము (పాలు) వృద్ధి చెందును.
  • బార్లి గింజలను 5 నుండి 10 గ్రాములు పావులీటరు పాలలో మెత్తగా అగునట్టు మరిగించి, తగినంత చక్కెర కలిపి త్రాగుచుండిన స్త్రీలలో స్తన్యవృద్ధి కలుగును.

స్త్రీలలో బహిష్టు సక్రమంగా జరుగుటకు
ప్రతిదినమూ ఉదయం పూట రెండేసి మందారపువ్వులు చొప్పున తినుచుండిన స్త్రీ ఆరుదినములలో బహిష్టు అగును. ఋతుక్రమము సరిగా అగును.
 
శూలనొప్పులు తగ్గుటకు
కరక్కాయ పెచ్చులు పావుతులము (మూడు గ్రాములు), బెల్లము అరతులము (ఆరు గ్రాములు), నెయ్యి ఒక తులము (పన్నెండు గ్రాములు) కలిపి పూటకొక మోతాదుగా రోజుకు రెండుపూటలా తినుచుండినచో శూలనొప్పులు హరించును.
 
శిశువులలో పుష్టి కొరకు
 
 
చిన్న పిల్లలలో, శిశువులలో బలము కలిగించుటకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా దేశీయ ఆవు వెన్నను (జెర్సీ ఆవు కాదు) తినిపించినచో శిశువులు దృఢశరీరము కలవారై, ఏ రోగములు లేకుండా పెరిగెదరు.

శరీర పుష్టి కొరకు
యష్టిమధుకమును మెత్తగా పొడిచేసి రోజుకు 2 గ్రాములు పాలలో కలిపి సేవించినచో శరీరానికి పుష్టి కలిగి, మానసికశక్తిని వృద్ధి చేయును. మరియు ముసలితనము రాకుండా కాపాడును.
 
- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..
 
గృహవైద్యము శీర్షిక ఇంతటితో సమాప్తము