గృహప్రవేశం - దళితులకూ ఆహ్వానం

 
ఈనాటికీ అంటరానితనం ఉన్నదంటే విచారకరం. కోలార్ జిల్లాలో (కర్నాటక) ఈ జాడ్యం ఇంకా కొనసాగుతున్నది. ఈ జాడ్యం వదిలించడానికి తన ప్రయత్నంగా శివప్ప అనే ఒక లెక్చరర్ పూనుకుని ఒక పథకం ప్రారంభించారు. దీనిద్వారా దళిత వాద్యకారులను ఇంట్లోకి ఆహ్వానించి తగురీతిగా గౌరవిస్తారు. ఈ కార్యక్రమం పేరు 'గృహప్రవేశం' 'అందరికీ ఆహ్వానం, దళితులకూ ఆహ్వానం' అనేది నినాదం. ఇప్పడు జిల్లాలో ఇటువంటి గృహప్రవేశాలు చాలా జరుగుతున్నాయి. సంతోషం.
 
- ధర్మపాలుడు