చొరబాటుదార్లకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సహకరిస్తున్నదా...?


ఈ మధ్య పశ్చిమబెంగాల్ లో జరిగిన బాంబు విస్ఫోటనం దర్యాప్తులో జమాత్-ఉల్-ముజాహిదీన్ సంస్థ హస్తం ఉన్నదని, ఈ సంస్థ బంగ్లాదేశ్ కేంద్రంగా పని చేస్తున్నదని జాతీయ నేరపరిశోధన సంస్థ (ఎన్.ఐ.ఎ.) దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా 30 కేంద్రాలలో ఆ సంస్థ రహస్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆ దర్యాప్తులో బయటపడింది. ఆ కేంద్రాలలో ముఖ్యమైనవి పశ్చిమబెంగాల్, అస్సాం, దక్షిణ భారత్ లలో ఉన్నాయని కనుగొన్నారు.   

బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ద్వారా ప్రతిరోజూ వందల సంఖ్యలో అక్రమ చొరబాటుదార్లు మనదేశంలోకి చొరబడి దేశమంతా విస్తరిస్తూ, విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఈ చొరబాట్లను చూస్తూ ఊరుకోకుండా సరియైన చర్యలు తీసుకోవాలి.