మహాభారత పద్యాలు (విదుర నీతి)

ధనమును, విద్యయు, వంశం
బును దుర్మతులకు మదంబున్ బొనరించును, స

జ్జనులైన వారి కడకువ
యును వినయము నివియ తెచ్చు నుర్వీనాథా !


భావం : రాజా ! ధనం, విద్య, మంచి వంశం అనేవి చెడిన వారికి మదాన్ని కలిగిస్తాయి. ఇవే బుద్ధిమంతులకు వినయ విధేయతలు చేకూరుస్తాయి.
- తే. 2.35, సం.2.4,4, పు. 46