మతం మార్చుకోవడం అనేది మూర్ఖత్వం

యదార్థంగా జరిగిన సంఘటన

(గూగుల్ ఫోటో)

గత సంచిక తరువాయి....

'ప్చ్... నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావ్' అంది అమాయకంగా పేస్ పెట్టి. 'ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు, ఓ హిందువు రామాయణ, భారత శ్లోకాలు, గాయత్రీ మంత్రం, హనుమాన్ చాలీసా లాంటివి చదువుతాడు, క్లాసు పుస్తకాలు చదువుతాడు, పాసవుతాడు. ఓ ముస్లిం ఖురాన్ చదువుతాడు, క్లాసు పుస్తకాలు చదువుతాడు, పాసవుతాడు. మరి ఓ క్రిస్టియన్ కూడా బైబిల్తో పాటు క్లాసు పుస్తకాలు చదివితేనే పాసయ్యేటట్లైతే ఇంక బైబిల్ స్పెషాలిటీ ఏంటి? ఆ మాత్రం దానికి మతం మార్చుకోవడం ఎందుకు?

ఓ హిందువూ, ఓ ముస్లిమూ చేయలేనిదీ, కేవలం క్రిస్టియన్ మాత్రమే చేయగలిగింది ఏదైనా ఉంటే చెప్పు, ఉదాహరణకు క్రిస్టియన్లందరూ ఎక్కువకాలం బతుకుతారని గానీ, లేదా క్రిస్టియన్లందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని గానీ,  లేదా క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వర్షాలు చక్కగా పడతాయని, పంటలు బాగా పండుతాయని గానీ ఇలాంటివేవైనా ఉంటే చెప్పు, ఈ క్షణమే నేను మతం మార్చకుంటా' అన్నాను.

తను ఏమీ మాట్లాడకుండా బ్లాంక్ ఫేసుతో వింటోంది. 'మతం ఏదైనా అది కేవలం ఓ నమ్మకం మాత్రమే. ఏ మతం కూడా రీజనింగ్ కి నిలవదు. అలాంటప్పుడు ఫలానా మతం మంచిది, ఫలానా మతం చెడ్డదని చెప్పటం మీనింగ్ లెస్. ఈ మతం బాగోలేదని మరో మతంలోనికి జంప్ కావడం, పైగా దీనికోసం కని, పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులతో గొడవపడటం మూర్ఖత్వం తప్ప మరేం కాదు' - ఇలా నాలుగు భారీ డైలాగులు చెప్పాను. తనుమాత్రం కళ్లుతెరచి కోమాలో ఉన్నట్లు సీరియస్ గా వింటున్నది. ఇక అక్కడ ఎక్కువసేపు ఉండటం అనవసరమనుకుని, మతం గురించి ఇంకో నాలుగు డైలాగులు వదిలి 'నాకు అర్జంటు పని ఉంది, వెళ్ళాలి' అని చెప్పి వచ్చేశాను. ఆ తర్వాత తననెప్పుడూ కలిసే ప్రయత్నం చేయలేదు. ఏ మిషనరీలోనో చేరిపోయి ఉంటుందనుకుని ఆ విషయం మరిచిపోయాను.

సీన్ కట్ చేస్తే సుమారు 3 సంవత్సరాల తరువాత మా ఊరికి వెళ్లే బస్సులో చంకలో ఓ ఏడాది వయసున్న బుజ్జిబాబుతో ఆమె సడన్ గా తారసపడింది. 'హాయ్, ఎలా ఉన్నావ్, ఎవరీ బాబు?' అన్నాను. 'నా కొడుకే' అంది. 'ఏంటి పెళ్లి చేసుకున్నావా' అప్రయత్నంగానే అనేశాను. 'ఏం మాట్లాడుతున్నావ్' అంది ఫేస్ ఇబ్బందిగా పెట్టి. 'ఓ.. సారీ! అప్పుడేదో నన్, సేవ, పెళ్ళి చేసుకోను అన్నావ్ కదా! అదేమైంది?' అన్నాను. 'ఓ.. అదా! అలా వెళ్దామనే అనుకున్నాను, కానీ, ఏదో నీ పుణ్యం వల్ల ఇలా ఉన్నా'నంది. 'అదేంటి?, నేనేం చేశాను?' అన్నాను ఆశ్చర్యంతో..

'అదే అప్పుడు నీతో మాట్లాడాను కదా! పార్కులో. ఆ తర్వాత బాగా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. దానితో ఇక అవన్నీ వదిలేసి మరుసటి రోజే ఇంటికెళ్ళిపోయాను. తర్వాత ఇంట్లోవాళ్ళు ఓ మంచి సంబంధం ఖాయం చేశారు. పెళ్ళికి నిన్ను పిలుద్దామనుకున్నాను, కానీ, కుదర్లేదు' అంది.

'ఓ.. నా వాగుడికి ఇంత పవర్ ఉందా!' అని ఆశ్చర్యంతో కూడిన గర్వం వల్ల వచ్చిన ఆనందం కలిగి, ఏ సెభాశ్.. సెభాశ్.. అని నన్ను నేను భుజం చరుచుకున్నాను' మనసులో.

'సరే, ఇంతకీ బాబు పేరేంటి' అన్నాను గులాబ్ జాం లాంటి బాబు మెత్తటి బుగ్గలు నిమురుతూ.. ''హిమనేష్' శివుడి పేరు, బాగుందా?' అంది చాలా ఆనందంగా. 'డేవిడ్ జాన్' అంత పవర్ ఫుల్ గా లేదుకానీ, బాగానే ఉంది' అన్నాను సరదాగా. 'నువ్వు మరీ ఎక్కువ చెయ్యకు' అంది నవ్వుతూ. ఇంతలో డ్రైవర్ బస్సు స్టార్ట్ చెయ్యడంతో 'బై' చెప్పి వెళ్ళిపోయాను. బస్సు రివ్వున దూసుకుపోయింది కర్నూల్, కడప వైపుకు...

- అయ్యల సోమయాజుల