ఆర్.ఎస్.ఎస్.ను చూసి నేర్చుకోండి

సి.పి.ఎమ్. ప్రధానకార్యదర్శి ప్రకాశ్ కారత్

రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని దూషించడమే పనిగా పెట్టుకున్న మార్క్సిస్టులకు (కమ్యూనిస్టులు) జ్ఞానోదయం అయినట్లు కనబడుతున్నది. 

సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సి.ఐ.టి.యు) అనే సి.పి.ఎమ్.కు చెందిన కార్మికసంఘం వారు 'మతోన్మాదం - కార్మిక లోకం' అనే అంశం మీద ఒక పెద్ద సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు ప్రధానవక్తగా వచ్చిన సి.పి.ఎమ్. ప్రధానకార్యదర్శి ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ "ఎప్పుడూ ఘర్షణాత్మక ధోరణితో, సమ్మెలు చేసుకుంటూ ఎన్నికలు నిర్వహించుకుంటూ ఉంటే సరిపోదు, మనం కూడా నిర్మాణాత్మకంగా పనిచేయాలి. మీరంతా ఆర్.ఎస్.ఎస్.ను చూసి పని ఎలా చేయాలో నేర్చుకోండి. సంఘం ప్రవేశించని రంగం దేశంలో లేనేలేదు" అని ప్రసంగించారు. 

ఈ విషయం అన్ని పత్రికలలో ప్రచురించబడింది. అదిచూసి కంగారు పడిన కారత్ "అబ్బే! నేను అలా అనలేదు" అని నాలుక్కరుచుకున్నారు. కాని ఇలా 'అని, అనలేదని తప్పించుకోవడం' కమ్యూనిస్టులకు అలవాటే. కొంతకాలం ఆగి మళ్ళీ వారే ఈ విషయాన్ని ధృవీకరిస్తారు. 

- ధర్మపాలుడు