"ఆకాష్" క్షిపణి విజయవంతం


మొన్న మొన్ననే మనం అగ్ని-6 సుదూర లక్ష్యాన్ని చేదించే క్షిపణి విజయవంతంగా ప్రయోగించాం. ఏ క్షిపణిని చూసి చైనా కూడా ఝడుసుకున్నది. ఇది ఇలా ఉండగా భూమిమీద నుండి ప్రయోగించి ఆకాశంలో ఉండే లక్ష్యాలను చేదించే "ఆకాష్" క్షిపణిని ఒడిషాలోని  చాందిపురం ప్రయోగ క్షేత్రం నుండి మన శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. అంతకు రెండు రోజుల ముందు కూడా ఇటువంటి ప్రయోగమే విజయవంతంగా జరిగింది. 'రక్షణ పరిశోధన సంస్థ' (డి.ఆర్.డి.ఓ.) వారు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ క్షిపణి మన వైమానిక దళం అమ్ముల పొదిలో క్రొత్త ఆయుధంగా చేరింది. దేశాన్నేలే వారు దోపిడీలు చేస్తున్నా కనీసం శాస్త్రవేత్తలు దేశ హితం కోసం శ్రమించడం ముదావహం. వారందరికీ లోకహితం జేజేలు పలుకుతున్నది.


- ధర్మపాలుడు