సమాజ హితాన్ని కోరేవాడే నిజమైన జర్నలిస్టు

సమాచార భారతి ఆధ్వర్యంలో జరిగిన జర్నలిజం అవగాహన సదస్సులో వక్తలు

సదస్సులో ప్రసంగిస్తున్న శ్రీ ఉమామహేశ్వరరావు, కూర్చున్న వారు ఎడమ నుండి శ్రీ ఆర్.మల్లికార్జునరావు, శ్రీ బాలస్వామి

సమాచార భారతి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29న పాలమూరు జిల్లాలోని వనపర్తి నగరంలో కళాశాల విద్యార్థులకు జర్నలిజం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సదస్సులో భాగ్యనగర్ లోని రచనా జర్నలిజం కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ ఉమామహేశ్వరరావు, వనపర్తి నగరంలోని యజ్ఞం పత్రిక సంపాదకులు శ్రీ బాలస్వామి, సమాచార భారతి రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఆర్.మల్లికార్జునరావు పాల్గొని ప్రసంగించారు.

'జనహితాన్ని కోరేది జర్నలిజం' అని శ్రీ ఉమామహేశ్వరరావు విద్యార్థులకు వివరించారు. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ వాటిని అందరి దృష్టికి తీసుకురావాలని శ్రీ బాలస్వామి పిలుపునిచ్చారు. మనం ప్రొఫెషనల్ జర్నలిస్టు కాకపోయినప్పటికీ, జర్నలిస్టు మైండుతో ఉన్నప్పుడు సమాజ హితం కోరగలుగుతాం, సమాజాన్ని చైతన్యవంత పరచగలుగుతామని సమాచార భారతి రాష్ట్ర కార్యదర్శి శ్రీ మల్లికార్జునరావు చెప్పారు.

ఈ కార్యక్రమం ప్రారంభంలో వనపర్తి జిల్లా ప్రచార ప్రముఖ్ శ్రీ శ్రీనివాస్ పరిచయ కార్యక్రమం నిర్వహించగా, చివరలో వనపర్తి నగర ప్రచార ప్రముఖ్ అవినాష్ వందన సమర్పణ చేశారు.