వాళ్ళు రెచ్చగొట్టారు - మేం జవాబిచ్చాం

ప్రముఖుల మాట


ఈసారి పాకిస్తాన్ వాళ్ళు గ్రామాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ముందుగా వాళ్ళే రెచ్చగొట్టారు, మేం సమాధానం మాత్రం ఇచ్చాం. మా ఆశయం ఒక్కటే. మనదేశ ప్రజలను కాపాడటం. వారికి (పాకిస్తాన్ కు) సరైన రీతిలో జవాబివ్వడం మన ప్రభుత్వ విధానం. మాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి కావలసిన సంఖ్యలో బలగాలున్నాయి, ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు ఉంది. అందుకే వాళ్లకు తగినరీతిలో బుద్ధి చెప్పగలుగుతున్నాం. అంతర్జాతీయ సరిహద్దులో సాధారణ స్థితి రావాలంటే అది పాకిస్తాన్ చేతిలోనే ఉంది. కాల్పులు ఎప్పుడు ఆగిపోవాలో వాళ్ళే నిర్ణయించుకోవాలి. మేం మన సరిహద్దులను, ప్రజలను కాపాడటానికే దీటుగా జవాబిస్తున్నాం.

- డి.కె.పాఠక్, డైరెక్టర్ జనరల్, బి.ఎస్.ఎఫ్.