నీతి పథంబునం బ్రతుకనేర్చుట యుత్తమభంగి శౌర్య సం
జాతములై కరం బలరు సంపద లొందుట మధ్యవృత్తి, య
స్ఫీతములైన భారవహజీవనముల్ తలంపంగ నిష్ఠముల్
నీతికి బాహ్యులైన ధరణీవర! మెత్తురె వారి నుత్తముల్
జాతములై కరం బలరు సంపద లొందుట మధ్యవృత్తి, య
స్ఫీతములైన భారవహజీవనముల్ తలంపంగ నిష్ఠముల్
నీతికి బాహ్యులైన ధరణీవర! మెత్తురె వారి నుత్తముల్
భావం : రాజా ! నీతి మార్గమున బ్రతుక నేర్వటం ఉత్తమ పధ్ధతి. తన రక్తి
యుక్తులతో సంపదలు పొందటం మధ్యమ పధ్ధతి. ఇంపూ సొంపూ లేక గానుగ ఎద్దువలె లాగే
జీవితం నీచ పధ్ధతి. నీతి తప్పిన వారిని ఉత్తములు మెచ్చుతారా?
- తే. 2.71, సం.3.76, పు. 78