అయోధ్యలో పంచకోశి పరిక్రమ


హిందూదేశం ఒక విశిష్టమైన దేశం. మన దేశంలో ఉన్నంత వైవిధ్యం, ఆ వైవిధ్యంలోనే ఏకత్వం. ఇటువంటి సంస్కృతి మొత్తం ప్రపంచంలో ఎక్కడా కనబడదు. హిందువులు ఆధ్యాత్మికవాదులు. పూజలు, వ్రతాలు, అర్చనలూ, ప్రదక్షిణలు, అభిషేకాలు, దీక్షలు ఇలా అంతులేనన్ని భక్తి మార్గాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి పరిక్రమ ప్రక్రియ. 

పరిక్రమ అంటే ఒక మహాప్రదక్షిణం లాంటిది. అయోధ్య, మధుర, కాశీ, హరిద్వాలలో ఈ పరిక్రమలు జరుగుతూ ఉంటాయి. 1992లో వివాదాస్పద కట్టడం నేలమట్టమైన తరువాత అయోధ్యలో జరిగే పంచకోశి పరిక్రమకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇటీవల భక్తజనులైన కొందరు హిందువులు మళ్ళీ అయోధ్యలో పంచకోశి పరిక్రమ నిర్వహించారు. కార్తీక మాసంలో పదకొండవ దినాన 16 కిలోమీటర్లు గల ఈ పరిక్రమ నిర్వహించబడింది. 


ఈ పరిక్రమలో అయోధ్యలోని చక్రతీర్థ ఘట్టం, నయాఘట్టం, రామఘట్టం, దశరథ కుండం, జొగైనా, రానోపలి, జల్ పనాలా మరియు మహతాబ్ బాగ్ లను చుట్టుకుంటూ వేలాది మంది హిందువులు జైశ్రీరాం నినాదంతో భక్తి ప్రపత్తులతో పంచకోశి పరిక్రమ నిర్వహించారు.

- ధర్మపాలుడు