అటువంటి పనులను ఇతరుల పట్ల చేయరాదు

ఏరిన ముత్యాలు - పద్యాలు


ఒరులేయవి యొనరించిన
నరవర ! యప్రియంబుదన మనంబున కగు దా
నొరులకునవి సేయకునికి
పరాయణము పరమధర్మపథములకెల్లన్


భావం : ఓ రాజా! ఇతరులు ఏ పనులు చేస్తే తన మనస్సునకు అయిష్టత కలుగుతుందో అటువంటి పనులను అతడు ఇతరుల పట్ల చేయకుండా ఉండుటే ఉత్తమమైన ధర్మము.