ఇస్లామిక్ ఆగడాలను సహించం - హిల్లరీ


ఇటీవల "అమాయక మహమ్మదీయులు" అనే చలనచిత్రం ఇంటర్నెట్లో పెట్టబడిన కారణంగా మహమ్మదీయులు ప్రపంచ వ్యాప్తంగా రెచ్చిపోయి హింసకు దిగారు. లిబియాలో అమెరికా రాయబారిని, కొందరు దౌత్య ఉద్యోగులను అమానుషంగా హత్య చేశారు. అనేక ఇతర తురక దేశాలలో కూడా తీవ్ర హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి శ్రీమతి హిల్లరీ క్లింటన్ ఈదుల్ ఫితర్ సందర్భంగా జరిగిన విందులో మాట్లాడుతూ, చలనచిత్రాన్ని అడ్డం పెట్టుకొని తురక తీవ్రవాదులు చేస్తున్న ఆగడాలను తీవ్రంగా ఖండించారు. "మనమంతా మతాన్ని గౌరవించే వారమే, ఏ మతానికి అవమానం జరగడం మనం ఆమోదించం. కాని ఏదో ఒక సాకుతో ముస్లింలు మాటిమాటికీ హత్యాకాండకు దిగడం చాలా గర్హనీయం" అంటూ ఆమె మహమ్మదీయుల హింసాతత్వాన్ని ఎండగట్టారు. "అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు గరుగుతూ ఉంటాయి. కొందరికి మనస్తాపం కలుగవచ్చును. కాని నిరసన తెలిపే తీరు ఇది కాదు". అన్నారు. "ఏం హిందువులకు, బౌద్ధులకు అవమానం జరగలేదా? వారు ఇలాగే ప్రవర్తించారా?" అని ఆమె ప్రశ్నించారు. క్రైస్తవ మతానికి కూడా కొన్నిసార్లు బాధ కలిగించే సంఘటనలు జరిగాయని, కాని వారు మహమ్మదీయుల వలే అనాగరికంగా ప్రవర్తించలేదని ముక్తాయించారు.

- 15/9/2012 నాటి ఆంద్ర భూమి ఆధారంగా
 
- ధర్మపాలుడు