కర్ణ పిశాచాలు


సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం మంచిదే కాని, సెల్ ఫోన్లు వాడకం పెరిగేకొద్దీ సమాజంలో విలువలు దారుణంగా పడిపోతున్నాయి అని షిర్డీ సాయిబాబా సంస్థానం వారు తలలు బాదుకుంటున్నారు.  

వివరాలలోకి వెళితే తమ ఉద్యోగులు భద్రతా సిబ్బంది కూడా విధి నిర్వహణలో ఉండగా సెల్ ఫోన్లు వాడరాడని షిర్డీ సాయిబాబా సంస్థానం ఆదేశాలు ఇచ్చింది. సెల్ ఫోన్ వాడకం వల్ల ఉద్యోగులలో అలసత్వం పెరుగుతోందని, అవినీతికి ఇది ఆలవాలమయ్యిందని వారు వాపోతున్నారు. షిర్డీలో సెల్ వాడకం సహించేది లేదని సంస్థానం వారు తెగేసి చెప్పారు. 

- ఈనాడు పత్రికలోని వార్త ఆధారంగా..

- ధర్మపాలుడు