ఆయుర్వేద శీర్షికను చాలా మంది కట్ చేసి భద్రపరచుకొంటున్నారు

పాఠకుల స్పందన

లోకహితం సంపాదకులు గారికి, ఆర్యా! లోకహితం మాసపత్రిక చాలా బాగుంటున్నది. ముఖ్యంగా "ఈ వార్తలు విన్నారా!" శీర్షిక ఎక్సలెంట్. గోవు మన తల్లి, దానికి ఊరువాళ్ళు అంత్యక్రియలు చేసిన విధం మాకు కళ్ళనీళ్ళు తెప్పించింది. ఇక వివేక సూర్యోదయంలో 8వ భాగంలో "భగవంతుడు కావాలని బలంగా కోరుకోవాలి" అనే వ్యాసం చాల చాలా బాగుంది. ఆయుర్వేద శీర్షిక కింద వస్తున్న విశేషాలను చాలా మంది కట్ చేసి భద్రపరచుకొంటున్నారు. ఇది నేను స్వయంగా చూసిన విషయం. కావున ఈ శీర్షికను కొనసాగించండి. జాతీయ నాయకులు, లవ్ జిహాద్ వంటి వాటి గురించి చాలా బాగా వ్రాశారు. ఈ పత్రికను వివిధ జిల్లాలకు, పల్లెలకు విస్తృతంగా పంపే వ్యవస్థ జరగాలని ప్రార్ధిస్తున్నాను. 

- యెర్రం శ్రీనివాసులు వరంగల్.