ఎవరు తవ్విన గోతిలో వారే పడతారు..

 
ఎవరినో చంపి పాతరెయ్యడానికి గొయ్యి తవ్వితే, ఆ గోతిలో త్రవ్వినవాడే పడి చచ్చాడనేది ఒక సామెత. ఇటువంటివే రెండు సంఘటనలు జరిగాయి. 
 
ఒక సంఘటనలో బాగ్దాద్ లో ఆత్మాహుతి దళానికి చెందిన ఒక అమాయక సోదరుడు మిగతా వారికి శిక్షణనిస్తున్నాడు, బెల్టులో బాంబులు ఎలా అమర్చాలి, ఎన్ని అమర్చాలి, ఎలా పేల్చాలి, అతి ఎక్కువ మందిని ఎలా హతమార్చాలి? అనే విషయంలో శిక్షణనిస్తుండగా అతని బెల్టుకున్న బాంబులు పేలి, ఆ అమాయక సోదరునితోపాటు అతనిచుట్టూ ఉన్న 22 మంది మిగతా అమాయక సోదరులు కూడా తునాతునకలైపోయారు. 
 
మరో సంఘటనలో మానవబాంబుగా వ్యవహరిస్తున్న ఒక తీవ్రవాది గాయంతో చనిపోగా అతని అంత్యక్రియల కొరకై చాలామంది తీవ్రవాదులు గుంపుగా వెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తి శరీరం నుండి బాంబు తొలగించని కారణంగా అది ప్రేలి, చుట్టూ ఉన్న అనేకమంది చనిపోయారు. ఈ సంఘటన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ & సిరియా తీవ్రవాదుల మధ్య సాలాహ్-ఉద్-దీన్ అనే ప్రదేశంలో జరిగింది.
 
- ధర్మపాలుడు