భారత - టిబెట్ ల ఏకత్వం


భారతదేశానికి ఉత్తరాన ఉన్న రాజ్యం "టిబెట్టు". భారత ప్రభుత్వం దృష్టిలో టిబెట్టు చైనాకి చెందిన భూభాగం. వాస్తవానికి ఏ కోణం నుంచి పరిశీలించినా టిబెట్టు వేల సంవత్సరాల నుండి సాంస్కృతికంగా మనదేశంతో ముడిపడి ఉన్నది. మహాభారత యుద్ధం సమయంలో కౌరవ పాండవులలో ఎవరి వైపూ చేరని "రూపతి" అనే రాజకుమారుడు చిన్న ప్రాంతాలుగా ఉన్న త్రివిష్టపాన్ని ఏకీకృతం చేసి ఒక మహారాజ్యంగా నిర్మించాడు. విదేశాలలో బౌద్ధ మతం ప్రచారం చేయడానికి వెళ్ళిన మనవారు టిబెట్టుకు వెళ్ళలేదు. అందుకు కారణం టిబెట్టు "మనకు విదేశం కాదు" కాబట్టి.


మరో విషయం. భారతదేశంలో ఉన్న అరవై ఏళ్ల కాలచక్రం టిబెట్టులో కూడా ఉంది. టిబెట్టు వారు కూడా చాంద్రమానం పాటిస్తారు. వారికి కూడా అధిక మాసాలు, క్షయ మాసాలు ఉన్నాయి. చైనా సంస్కృతికి, టిబెట్ సంస్కృతికి ఎక్కడా పొంతన కానరాదు. టిబెట్టు వారు మాట్లాడే "బోటీ" భాష సంస్కృతం మూలాలు కలిగి ఉన్నది. అందుకే త్రివిష్టప భాషా కోవిదులు సంస్కృతంలోని బౌద్ధ మత గ్రంథాలను మాత్రమే వారి భాషలోకి అనువదించారు. చైనా భాష నుండి అనువదించబడ్డ గ్రంథాలు లేకపోవడం గమనార్హం. ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో ఆధారాలు దొరుకుతాయి. 

15.9.2012 ఆంధ్రభూమి తంగేడుకుంట వ్యాసం ఆధారంగా

- ధర్మపాలుడు