బాపుకు శ్రద్ధాంజలి

బాపు
 
బాపు గొప్ప రామభక్తుడు. రామాయణ మహాకావ్యాన్ని పదిసార్లు పది విధాలుగా చిత్రీకరించారు. రాముడు తన గొప్పతనాన్ని తానే చెప్పుకొనేందుకు త్యాగరాజస్వామిగా పుట్టి తనివితీరా కీర్తనాలు కట్టాడని బాపు ఒకసారి తన మిత్రుడికి చెబుతూ నవ్వేసారట. 
 
రామాయణము రామతత్వంతో మమేకమైన బాపు వ్యవహారం కూడా అలాగే ఉండేది. పొగడ్తలకు పొంగేవారు కాదు. సన్మానాలకు చాలా దూరంగా మసలుకొనేవారు. ఒకవేళ ఏదైనా మాట్లాడవలసి వస్తే ముక్తసరిగా నాలుగు మాటలు మాట్లాడేవారు. జీవం ఉట్టిపడే వారి బొమ్మలు ఎంతో సందేశం ఇచ్చేవి. తెలుగు ప్రజల మనస్సులలో నిలిచిపోయిన ఆయన బొమ్మలే ఆయనను తరతరాలుగా జ్ఞాపకం ఉండేట్లుగా చేసాయి. అటువంటి బాపు భౌతికంగా మనముందు లేకపోయినా మన మనస్సులలో నిరతరం నిలిచే ఉంటారు. వారికి లోకహితం పత్రిక శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. 
 
- సంపాదకుడు