గృహ వైద్యము


భారతదేశమునందు ఆయుర్వేదము ప్రాచీన కాలము నుండి అత్యంత ప్రాచుర్యము పొందిన వైద్య విధానం. కృత్రిమంగా నిర్మాణమైన ఔషధ సేవన మాటిమాటికీ చేయుట వలన శరీరంలోని సహజంగా ఉండే రోగ నిరోధక శక్తి కుంటు పడవచ్చును. సహజమైన ఔషధ సేవన చేయటం వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవటం శారీరకంగానే కాక ఆర్థికంగా కూడా లాభదాయకం. నేడు ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు డాక్టర్ల దగ్గరకు పరుగెత్తటం పరిపాటి అయింది. ఆహార విహారాదులలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని, చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే మన గృహంలోనే రోగ నివారణ చేసుకోవచ్చు. దానికోసం ఈ మాసం నుండి మీ లోకహితం పత్రికలో 'గృహ వైద్యం' పేరుతో చిన్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకొనే చిట్కాలను పరిచయం చేస్తున్నాము.

కాబట్టి ఈ 'గృహ వైద్యం' శీర్షికను ఇక ప్రతిమాసం చదవండి, కొంతైనా లాభం పొందండి. లోకాస్సమస్తాః సుఖినో భవంతు. 

అజీర్ణము : 
చాలా మందికి తిన్న ఆహారం అరగక, చాల బాధ పడుతూ ఉంటారు. అటువంటి వారికోసం..


1) కరక్కాయ చూర్ణము, సైంధవ లవణము సమభాగాలుగా కలుపుకొని పూటకు 3 గ్రాములు చొప్పున ఉదయం, సాయంత్రం భోజనం తరువాత సేవించిన అన్ని రకముల అజీర్ణ రోగములు ఉపశమించును. 

కరక్కాయ
2) పచ్చి అరటికాయను ముక్కలు కోసి ఎండించి పొడిచేసి 1 నుండి 2 గ్రాముల పొడిని కొద్దిగా ఉప్పు కలిపి సేవించిన అజీర్ణము, పులి త్రేన్పులు గల అగ్ని మాంద్యము హరించును.

- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..