గ్రహణం పట్టిన విశ్వరూపం

 
ప్రముఖ చలనచిత్ర నటుడు నిర్మించిన "విశ్వరూపం" చిత్రం 25.1.2013 నాడు విడుదల కావలసి ఉండగా కొంతమంది ముస్లింలు అభ్యంతరం చెప్పడంతో చెన్నపట్నం హైకోర్టు చిత్రం విడుదలను నిలిపివేసింది. ఈ చిత్రంలో ఉన్న అభ్యంతరం ఏమిటో ముస్లింలు స్పష్టంగా చెప్పలేదు. మొన్నటికి మొన్న ఎన్నో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ ఎంతోమంది హిందువులు అభ్యంతరం చెప్పినప్పటికీ, ఆందోళన చేసినా కూడా "దేనికైనా రెడీ" అనే తెలుగు సినిమాను ఎవ్వరూ నిషేధించలేదు. అప్పుడేమో సినిమా పరిశ్రమవారు ఆందోళనను వ్యతిరేకించారు. ఇప్పుడేమో నోరు మూసుకున్నారు.
 
- ధర్మపాలుడు