నీ పాదపద్మములను సేవించు భాగ్యము నిమ్ము..

ఏరిన ముత్యాలు  - పద్యాలు
 
 
నీ పాద కమల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమ్ము, నితాం
తాపార భూత దయయను
తాపస మందార నాకు దయసేయ గదే!


భావం : తాపసులకు మందారవృక్షము వంటివాడవైన ఓ శ్రీకృష్ణా! నీ పాదపద్మములను సేవించు భాగ్యము, నిన్ను సేవించుచున్న భాగవతులతో స్నేహమును, ప్రాణికోటిపట్ల అంతులేని దయను కలిగియుండునట్టి గుణమును నాకు ప్రసాదింపుము.