నేను కూడా హిందువునే...

 
ప్రముఖ హిందీసినిమా నటుడు జనాబ్ అమీర్ ఖాన్ హిందువులను అవహేళన చేస్తూ నిర్మించిన 'పి.కె.' చిత్రం చాలా వివాదాలకు దారితీసింది. ఇదే విషయంలో సెన్సార్ బోర్డు అధ్యక్షురాలు లీలాశాంసన్ తన పదవికి రాజీనామా కూడా చేశారు. తదనంతరం ఆమె మాట్లాడుతూ "నేను కూడా హిందువునే, భరతనాట్యం నేర్చుకున్నాను, నటరాజస్వామిని, శివుడిని, విష్ణువును ఆరాధించాను" అన్నారు. "హిందూసంస్కృతి లేకుండా భరతనాట్యం లేదు, భారతీయ కళలు లేవు. నేను హిందువునని మా కుటుంబం కూడా అనుకుంటూ ఉంటుంది. మా నాన్న యూదు మతస్తుడు, మా అమ్మ కాథలిక్కు (క్రైస్తవం). అయినా నేను సంస్కృతి పరంగా హిందువును" అని గట్టిగా నొక్కిచెప్పారు.
 
- ధర్మపాలుడు